మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
By Ravi
On
మహేశ్వరం మండల కేంద్రంలో పీఏసీ ఎస్ గోదాం వద్ద వరి కొనుగోలు కేంద్రాన్ని మహేశ్వరం పీఏసీ ఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న అధ్యక్షులు పాండు యాదవ్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యా న్ని కొనుగోలు చేయడానికి పీఏసీఎస్ సిద్ధంగా ఉందని అన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో షఫీ, కే చంద్రయ్య, కృష్ణ నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్ చాకలి యాదయ్య,డైరెక్టర్ ప్రభాకర్, ఆదిల్ , మోడీ జంగయ్య, డైరెక్టర్ మునగపాటి నవీన్, తదితరులు ఉన్నారు.
Tags:
Latest News
06 May 2025 22:04:02
మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం విలేజ్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సర్వే నంబరు 354లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలను...