నిజాంపేటలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం
By Ravi
On
శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో హైదర్ నగర్ డివిజన్ నిజాంపేట్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అమాయక ప్రజలను కాల్చి చంపిన ముష్కర్లను మట్టుపెట్టాలని ప్రధానమంత్రి మోదీని బిజెపి నేతలు కోరారు. 30 మందికి పైగా ప్రజలు చనిపోయారని మరికొంతమందికి గాయాలయ్యాయని వారు వెంటనే కోల్కోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎంతోమంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ కు పర్యటనకు వస్తున్నారని అది ఓర్వలేకే దుండగులు కాల్పులు జరపడం హేయమైన చర్య అని విమర్శించారు. త్వరలోనే దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags:
Latest News
05 May 2025 22:31:42
- కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం- ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తి- కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న రేవంత్ పేరు- కులగణనలో తెలంగాణ మోడల్ తీసుకోవాలని విజ్ఞప్తి-...