హైదరాబాద్‌లో మే నుంచి జూన్ వరకు జూస్టాస్టిక్ సమ్మర్ క్యాంప్..!
వేసవిలో వన్యప్రాణులపై ఆసక్తి కలిగిన విద్యార్థులను సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనమని హైదరాబాద్ జూపార్క్ ఆహ్వానిస్తోంది. మే మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ క్యాంప్ జూన్ వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు 15 నుంచి 20 మంది విద్యార్థులతో ప్రత్యేక బ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ క్యాంప్ ద్వారా జూ పరిచయం, జూ టూర్, జూలోని జంతువుల గురించి తెలుసుకోవడం, సర్పాలపై అవగాహన కార్యక్రమం, నైట్ హౌస్ విజిట్, మరియు ఇతర వినోద కార్యక్రమాలను అనుభవించే అవకాశం కలుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలు అనుభవజ్ఞులైన వన్యప్రాణి విద్యావేత్తల నేతృత్వంలో నిర్వహించనున్నారు.
నమోదు రుసుం: ఒక్కో విద్యార్థికి రూ.1000/- (ఇందులో స్నాక్స్ మరియు శాకాహార లంచ్ ఉంటాయి.)
ప్రతి అభ్యర్థికి క్యాప్, నోట్‌ప్యాడ్, హైదరాబాద్ జూ లోగోతో కూడిన బ్యాడ్జ్‌ను కలిగిన కిట్ అందిస్తారు.
అర్హత: 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. మరిన్ని వివరాల కోసం జూపార్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లేదా అధికార వెబ్‌సైట్: www.nzptsfd.telangana.gov.in సందర్శించండి.
సంప్రదించేందుకు కాల్ చేయండి : 040-24477355
లేదా వాట్సాప్ : 9281007836