కెనడా నుంచి హిందువులను పంపించేయండి

By Ravi
On
కెనడా నుంచి హిందువులను పంపించేయండి

కెనడా దేశంలో ఖలిస్థానీలు తమ హవా చూపిస్తున్నారు. తాజాగా ఆ దేశం నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటు వాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు భారత ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి జై శంకర్‌ బొమ్మలను ఓ పంజరంలో పెట్టారు. అయితే తాజాగా ఖలిస్థానీ సపోర్టర్లు ఓ మందిరంలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు షవన్‌ బిండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు.. ఖలిస్థానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత అని పేర్కొన్నారు. కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణమని రాసుకొచ్చారు. 

కాగా ఖలిస్థానీలపై చర్యలు తీసుకోవడంలో కొత్త ప్రధాని మార్క్‌ కార్నీకి.. మాజీ ప్రధాని ట్రూడోకు ఏమైనా తేడా ఉందా అని క్వశ్చన్ చేశారు. ఖలిస్థానీలు భారత్ కు చెందిన కేంద్ర మంత్రులను బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల రైల్వేశాఖ సహాయమంత్రి రవనీత్‌ సింగ్‌ బిట్టూను హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా అతడే తెలిపారు. సోషల్ మీడియాలో లీక్ అయిన కొన్ని ఫోటోలు కూడా తన దృష్టికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

Latest News

కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
వికారాబాద్‌ ఈఎస్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీధర్‌ను కక్షపూరితంగా ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌  శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టించడంపై తెలంగాణ నాన్‌ గెజి టెడ్‌ ఉద్యోగుల...
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!
సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ
విడదల రజనీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 66 కార్పొరేట్ ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు
డ్యామ్‌ ల సామర్థ్యం పెంపు.. పాక్ ఖేల్ ఖతం..