ఎవరివీ ఫాంహౌస్‌లు..?

By Ravi
On
ఎవరివీ ఫాంహౌస్‌లు..?

- హిమాయత్‌సాగర్ బఫర్ జోన్‌లో బడా భవనాల నిర్మాణం
- ఎకరాల కొద్ది స్థలాల్లో ఫామ్‌హౌస్‌లు, కన్వెన్షన్ సెంటర్లు
- అధికారపార్టీ నేతల భవనాలంటూ ప్రచారం
- వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్న రెవెన్యూ అధికారులు
- బడా నేతల ఫామ్‌హౌస్‌లపై హైడ్రా ఓ లుక్కేయాలని సలహాలు

వడ్డించేది మన వాడయితే.. బంతిలో ఎక్కడ కూర్చున్నా.. అన్ని వంటకాలు దక్కుతాయటా. అచ్చం ఈ సామెతలానే ఉంది కొందరు అధికార పార్టీ నేతల తీరు. ఎక్కపడితే అక్కడ.. ఫిర్యాదు అందిన క్షణాల్లో వచ్చి వాలి బుల్డోజర్‌తో కోట్ల రూపాయల నిర్మాణాలు నేలమట్టం చేసే హైడ్రాకి అక్కడి బడా ఫామ్‌హౌస్‌లు.. కన్వెన్షన్ సెంటర్లు మాత్రం కనపడటం లేదు. అధికార పార్టీ అండదండలు.. ప్రతిపక్ష పార్టీ ఆశీర్వాదాలు వెరసి ఆ నిర్మాణాల జోలికి పోకూండా అడ్డుకుంటున్నాయన్న ఆపరోపణలు లేకపోలేదు. సిటీలో ప్రభుత్వ స్థలాలపై విరుచుకుడుతున్న హైడ్రా యంత్రాంగం.. శివారు ప్రాంతాలవైపు ఎందుకు చూడటం లేదని జనం విమర్శలు గుప్పిస్తున్నారు.

హైడ్రా ఏర్పాటు జరిగిన తరువాత చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే తనవాడైన, పరాయి వాడైనా వదిలేది లేదంటూ చెప్పిన సీఎం రేవంత్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్.. శివారు ప్రాంతాలవైపు కూడా ఓసారి చూస్తే.. బాగుటుందనే వాదన నడుస్తోంది. గతంలో కేటీఆర్ ఫామ్‌హౌస్ ప్రభుత్వ స్థలంలో నిర్మాణం జరిగిందని నానా హంగామా చేసిన సీఎం, ఇప్పుడు ఈ బడా నేతలు బఫర్ జోన్‌లో చేసిన కట్టడాలు కానరావడం లేదా..? అని ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, కొత్వాల్ గూడ ప్రాంతంలో 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో హిమాయత్‌సాగర్ ఉంది. దీని చూట్టూ మరో పది కిలోమీటర్ల వరకు అధికారులు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లంటూ తేల్చి రికార్డుల్లో పొందుపరిచారు. జనాల దాహార్తిని తీర్చే హిమాయత్‌సాగర్ రాను రాను కుదించుకోపోయింది.

సర్వే నెంబర్ 52|ఆ, 52\1, 52\17, 53\17 బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి. ధరణి పోర్టల్‌లో కూడా ఆయా సర్వే నంబర్లు బఫర్ జోన్లుగానే చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సర్వే నెంబర్లలో 2023 నుంచి చూస్తే.. రెండేళ్లలో ఆఘమేఘాల మీద 56 నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం ఇంకా కొన్ని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సుమారు 12 ఎకరాల నుంచి మొదలుకొని 15, 20 ఎకరాల వరకు ఫామ్‌హౌస్‌లు, కన్వెన్షన్ సెంటర్‌ల ఏర్పాటు జరిగింది. వీటిలో కొన్ని సగంలో ఆగిపోగా, మిగతావి పూర్తయ్యాయి. అయితే ఇవి ఎవరివి అంటే మాత్రం జనాలకే కాదు.. అధికారుల రికార్డుల్లో కూడా సరైన పేరు లేదు. కొందరు అధికార పార్టీకి చెందిన బడా నేతలవని, మరికొందరు ప్రతిపక్ష హోదాలో ఉన్న టాప్ లీడర్లవని చెబుతున్నారు. చుట్టూ దట్టమైన అడవిని తలపించేలా చెట్లు, ఎత్తైన గోడలు, చుట్టూ సీసీ కెమేరాలు.. లోపలికి చీమకూడ దూరలేని కట్టుదిట్టం చేశారు. అంటే కచ్చితంగా ప్రస్తుత అధికార పార్టీకి చెందిన బడా నేతలవేనని ఇట్టే అర్థమవుతోంది. ఈ కన్వెన్షన్‌ సెంటర్లపై ఎవరైనా కన్నెస్తే.. వారి పని అంతే అంట. అప్పుడప్పుడు బందోబస్తు నడుమ కొందరు నేతలు, వారి కుటుంబ సభ్యులు వచ్చి వెళుతుంటారనేది జనం చెప్పే మాట. ఆయా సర్వే నెంబర్ల గురించి ఆరా తీస్తే వివరాలు చెప్పడానికి జనమే కాదు.. చివరకు రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు కూడా మొహం చాటేస్తున్నారు. గట్టిగా నిలదిస్తే తమ రికార్డుల్లో బఫర్ జోన్ అనే ఉంది తప్ప ఎలాంటి నిర్మాణాలు లేవంటూ కుంటిసాకులు చెబుతున్నారు.

మరోవైపు దర్జాగా హిమాయత్‌సాగర్‌లో కబ్జాలు చేస్తూ ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో కూడా బడా నిర్మాణాలు చేపట్టినా హైడ్రా ఏం చేస్తోందని జనాలు ప్రశ్నిస్తున్నారు. చెరువును కబ్జా చేశారంటూ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌తోపాటు, ఫామ్‌హౌస్‌లు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు.. హిమాయత్‌సాగర్ బఫర్ జోన్‌లో జరుగుతున్న నిర్మాణాలపై ఎందుకు చూడటం లేదనే విమర్శలు లేక పోలేదు. జనాలు చెప్పే సమాధానాలు, వివరాలు చెప్పని అధికారుల తీరు చూస్తే అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ కోసం రూపొందిన హైడ్రా.. హిమాయత్ సాగర్ బఫర్ జోన్‌లో నిర్మాణం అయిన కన్వెన్షన్ సెంటర్లు, ఫామ్‌హౌస్‌లపై ఓ లుక్కేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనం కోరుతున్నారు. బాస్ మనోడు అయితే బడా నేతల ఆగడాలకు అడ్డూఅదుపూ ఉండదనేది ఇక్కడి నిర్మాణాలు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. మరి ఈ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఏం సమాధానం చెబుతారన్నది చర్చనీయాంశంగా మారింది.

Related Posts

Advertisement

Latest News

బంజారాహిల్స్ లో కబ్జాకు గురై స్వాధీనం చేసుకున్న స్థలం పరిశీలన బంజారాహిల్స్ లో కబ్జాకు గురై స్వాధీనం చేసుకున్న స్థలం పరిశీలన
బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురై తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ , కలెక్టర్...
హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొల్లురులో ఉచిత వైద్య శిబిరం
కుత్బుల్లాపూర్ లో అక్రమంగా వెలిసిన ఇండ్లపై రెవెన్యూ అధికారుల దాడులు
దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం..!
కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం స్వాధీనం.. పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌..!
అక్రమంగా వెలిసిన ఇళ్లపై రెవెన్యూ అధికారుల దాడులు..!
పవన్‌పై మోదీ కన్సర్న్‌ వెనుక పెద్ద ప్లాన్‌..!