తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 66 కార్పొరేట్ ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు

By Ravi
On
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 66 కార్పొరేట్ ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు

తెలంగాణ మందుల నియంత్రణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన అలాగే వాటికి అనుబంధంగా ఉన్న ఫార్మసీలపై దాడులు నిర్వహించింది. కూకట్‌పల్లిలోని ఓ ఆసుపత్రిలో రూ.70,000/- విలువైన మెడికల్ డివైస్ స్టాక్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. మొత్తం 66 కార్పొరేట్ ఆసుపత్రులలోని ఫార్మసీలలో అనేక అక్రమాలు బయటపడగా, వీటికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 
ఈ దాడుల్లో  ఫార్మసిస్టు లేని మెడికల్ షాప్స్ లలో మందుల విక్రయాలు, విక్రయ బిల్లులను సక్రమంగా నిర్వహించకపోవడం,  ప్రిస్క్రిప్షన్ డ్రగ్ రిజిస్టర్లు మరియు షెడ్యూల్ H1 డ్రగ్ రిజిస్టర్లను నిర్వహించకపోవడం, స్టాక్ చేసిన ఔషధాల కొనుగోలు బిల్లులు చూపించకపోవడం, నమోదు చేసిన వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఔషధాల విక్రయం, కొనుగోలు మరియు విక్రయ బిల్లుల కాపీలు సక్రమంగా లేనివి, 
తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన ఔషధాలను సరైన పరిస్థితుల్లో నిల్వ చేయకపోవడం, గడువు ముగిసిన ఔషధాలను అమ్మదగిన ఔషధాలతో కలిపి నిల్వ చేయడం గుర్తించారు. వీటిలో కూకట్పల్లి రెమిడీ ఆసుపత్రి, మెదక్ పట్టణం, అహ్మద్ నగర్ కాలనీ లైఫ్ కేర్ ఫార్మసీ,  మల్కాజిగిరి గెంకేర్ పౌలోమి ఆసుపత్రి ఇలా మొత్తం 66 ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఔషధ తయారీ (నార్కోటిక్ ఔషధాలు మరియు మానసిక ఉల్లాసకర పదార్థాల ఉత్పత్తి సహా) నివాస, వాణిజ్య, పరిశ్రమ ప్రాంతాల్లో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాలు, అలాగే ఇతర అసౌకర్యకరమైన ఔషధాలకు సంబంధించిన ఫిర్యాదులను, తెలంగాణ మందుల నియంత్రణ శాఖ టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969కు సమాచారం ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.IMG-20250505-WA0136

Tags:

Advertisement

Latest News

కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..! కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..!
- కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం- ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తి- కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న రేవంత్‌ పేరు- కులగణనలో తెలంగాణ మోడల్‌ తీసుకోవాలని విజ్ఞప్తి-...
సమ్మె వద్దు.. ఆర్టీసీ యాజమాన్యం లేఖ
ఆర్టీసీ ఆసుప‌త్రిలో డీఎన్‌బీ పీజీ మెడిక‌ల్ కోర్సులు
పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం
ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..!
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!