నీళ్లు ఆపితే అణ్వాయుధ దాడి.. పాక్ వార్నింగ్..

By Ravi
On
నీళ్లు ఆపితే అణ్వాయుధ దాడి.. పాక్ వార్నింగ్..

తమ దేశానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటే ఊరుకునే పరిస్థితి లేదని పాకిస్తాన్ వార్నింగ్ చర్యలు చేపట్టింది. నీటిని దారి మళ్లించినా కూడా ఆ పరిస్థితిని తిప్పి కొడతామని, అవసరం అయితే అణ్వాయుధ దాడి చేపడతామని పాకిస్తాన్ తెలిపింది. కాగా రష్యాలోని పాకిస్తాన్ అంబాసిడర్ మొహమ్మద్ ఖలీద్ జమాలీ ఈ కామెంట్స్ చేశారు. ర‌ష్యా న్యూస్ మీడియా ఏజెన్సీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విధంగా మాట్లాడారు. పహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ఇండో, పాక్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌లు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. పాక్ చ‌ర్య‌ల‌ను ఖండిస్తూ సింధూ జ‌లాల‌ను ఆపేందుకు భార‌త స‌ర్కారు సిద్ధ‌మైంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ క్రమంలో సింధూ జ‌లాల ఒప్పందాన్ని స‌స్పెండ్ చేస్తూ.. తాజాగా చీనాబ్ న‌ది నీటిని రిలీజ్ చేయ‌డం లేదు. ఒక‌వేళ నీళ్ల‌ను అడ్డుకున్నా లేక దారి మ‌ళ్లించినా ప‌ర్య‌వ‌సానాలు తీవ్రంగా ఉంటాయ‌ని ఆ అంబాసిడ‌ర్ పేర్కోన్నారు. నీళ్ల‌ను అడ్డుకోవ‌డాన్ని, డైవ‌ర్ట్ చేయ‌డాన్ని యుద్ధ చ‌ర్య‌గా భావిస్తామ‌ని, దీన్ని పూర్తి స్థాయిలో తిప్పికొడుతామ‌న్నారు. ఏప్రిల్ 22వ తేదీన పెహ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో 26 మంది ప‌ర్యాట‌కు మృతిచెందిన విష‌యం తెలిసిందే. అయితే రెండు దేశాల స‌మ‌స్య‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని ఆయ‌న ఈ సందర్భంగా అభిప్రాయ‌ప‌డ్డారు.

Advertisement

Latest News

కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
వికారాబాద్‌ ఈఎస్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీధర్‌ను కక్షపూరితంగా ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌  శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టించడంపై తెలంగాణ నాన్‌ గెజి టెడ్‌ ఉద్యోగుల...
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!
సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ
విడదల రజనీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 66 కార్పొరేట్ ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు
డ్యామ్‌ ల సామర్థ్యం పెంపు.. పాక్ ఖేల్ ఖతం..