లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
By Ravi
On
వికారాబాద్ జిల్లా నిషేధ మరియు ఎక్సైజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టీ. శ్రీధర్ లంచం తీసుకుంటూ ఎసిబీకి చిక్కాడు. ఓ ఫిర్యాదుదారుడి టీఏ బిల్లును ప్రాసెస్ చేయడం కోసం రూ. 8,000 లంచం డిమాండ్ చేశాడు. దీనితో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. డిమాండ్ చేసిన డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం టీ. శ్రీధర్‌ను అరెస్ట్ చేసి, నాంపల్లి స్పెషల్ జడ్జి కోర్టులో హాజరు పరచనున్నారు . ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసిన సందర్భంలో, ప్రజలు వెంటనే ఎసిబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కి కాల్ చేయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చు. ఫిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
Tags:
Latest News
02 May 2025 22:04:48
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం...