జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్‌ రెడ్‌ కార్పెట్‌..!

By Ravi
On
జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్‌ రెడ్‌ కార్పెట్‌..!

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్‌పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాల్గొంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్‌పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ, జపాన్‌ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. 

ఇక ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన విధానాలు, సులభతర పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. ‘హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్‌తోపాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకొండి..’అని జపాన్ కంపెనీలను సీఎం తెలంగాణకు ఆహ్వానించారు. తెలంగాణకు జపాన్ మధ్య చక్కటి సంబంధాలున్నాయని.. ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతోందని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణతోపాటు ఒసాకా, ప్రపంచంతో కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. 

WhatsApp Image 2025-04-21 at 6.04.17 PM

ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వీటితోపాటు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్​టైల్స్​ రంగాల పరిశ్రమలకు ఉన్న అనుకూలతలను వివరించారు. హైదరాబాద్‌లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని.. ఎకో ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీపై ఈ సిటీ ఆధారపడుతుందన్నారు. 
జపాన్‌కు చెందిన మారుబెని కార్పొరేషన్‌తో ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లతో పాటు ఆర్ఆర్ఆర్‌కు ఔటర్ రింగ్ రోడ్‌కు మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందన్నారు. ఎగుమతులకు వీలుగా సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్ట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్ వే అభివృద్ధి చేసేందుకు టోక్యో, ఒసాకా నగరాలను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. నైపుణ్యాల శిక్షణతోపాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామని.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో ఉపాధి, వ్యాపార అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు.

Advertisement

Latest News

రెట్రోకి సాలిడ్ ఓపెనింగ్స్ దక్కినట్లేనా? రెట్రోకి సాలిడ్ ఓపెనింగ్స్ దక్కినట్లేనా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీనే రెట్రో. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న...
హిట్ 3 సెన్సేషన్.. 
ఉప్పల్- ఘట్కేసర్ ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాలి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు
మూడుచింతలపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారుల దాడి.. గంజాయి స్వాధీనం
పాతబస్తీ ఫలక్ నుమా ప్రాంతంలో పాన్ షాప్ యజమాని హత్య
షీ టీమ్స్ ప్రత్యేక వాహనాలు ప్రారంభించిన సీపీ మహంతి