ట్రంప్ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
అమెరికా, చైనాల మధ్య టారీఫ్ చర్చలు కారణంగా ట్రేడ్ వార్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. టారిఫ్ లపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం చైనా అధికారులను సంప్రదించింది. తాజాగా ఈ విషయంపై బీజింగ్ స్పందిస్తూ.. వాషింగ్టన్ రీసెంట్ గా తీసుకున్న ట్రేడ్ విధాన నిర్ణయాలు, సుంకాల తగ్గింపు విషయంపై అగ్రరాజ్యంతో చర్చలు జరపాలా..? వద్దా.. అని ఆలోచిస్తున్నట్లుగా ఈ సందర్భంగా వెల్లడించింది. టారిఫ్ సమస్యలపై బీజింగ్‌తో చర్చలు జరపాలనే ఆశను వ్యక్తంచేస్తూ అమెరికా సంబంధిత వర్గాల ద్వారా అనేకసార్లు సందేశాలను పంపింది. దీంతో చర్చల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని అధికారులతో సంప్రదించి ఓ అంచనాకు వస్తాము అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రస్తుతం చైనా చెబుతున్న ఈ వ్యాఖ్యలు పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధ వాతావరణం ఏర్పడింది. అలాంటిది ఇప్పుడు తాజాగా జరిగిన మీటింగ్ ఆ ఉద్దేశ్యం ఇరు దేశాల మధ్య తొలగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తమపై టారిఫ్ విధిస్తూ.. వాణిజ్య యుద్ధాన్ని అమెరికా ఏకపక్షంగా ప్రారంభించిందని వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి అన్నారు. ఇప్పుడు ఆ దేశం తమతో చర్చలు జరపాలంటే తమతో నిజాయతీగా ఉండాలని తెలిపారు. బీజింగ్‌తో వ్యవహరిస్తున్న తప్పుడు పద్ధతులను సరిదిద్దుకొని.. తమపై విధించిన ఏకపక్ష సుంకాలను ఎత్తివేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే అమెరికాతో బీజింగ్ సానుకూల చర్యలు చేపడుతుందని తెలిపారు.