తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం

By Ravi
On
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం

ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 పోలీస్ ర్యాంకింగ్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ పని చేస్తున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల నుంచి వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఆయన తన కార్యాలయంలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తాను సివిల్ సర్వీసెస్‌కు సెలెక్ట్ అయిన తర్వాత ఏ సర్వీస్ ఎంపిక చేసుకోవాలని పలువురితో చర్చించానని.. చాలామంది ఐపీఎస్ ఎంపిక పట్ల విముఖత కనబరిచారన్నారు. కానీ.. 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దేశంలోనే ప్రథమ స్థానం పొందిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని హర్షద్వానాల మధ్య సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ పనితీరు, విధానాలను పరిశీలించి మన పోలీస్ సిబ్బంది శిక్షణ, రిసెప్షన్, తదితర 32 ప్రామాణికాలను బేరీజు వేయడం ద్వారా దేశంలోనే మొదటి స్థానాన్ని పొందామన్నారు. ఈ గౌరవాన్ని నిలుపుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత సమర్థంగా, జాగ్రత్తగా పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. 

రాష్ట్ర పోలీస్ శాఖకు దక్కిన ప్రథమ స్థానాన్ని నిలుపుకోవాలంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరు మెరుగుపడాలనీ.. బాధితులకు న్యాయం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఎస్‌హెచ్‌వోలు పనిచేయాలని సూచించారు. ఫిర్యాదులను స్వీకరించి దర్యాప్తు చేయడం ద్వారా వాస్తవాలను తెలుసుకోవాలని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ ప్రజల రక్షణ కోసం ఉన్నదన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలని, బాధితులకు న్యాయం జరగనప్పుడు పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఎస్‌హెచ్‌వోల పనితీరు తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ పద్ధతిని ప్రవేశపెట్టామని.. దాని ద్వారా పనితీరును తెలుసుకుంటున్నామని చెప్పారు. సీసీటీఎన్ఎస్ పనితీరును క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. తమ పనితీరును కుటుంబ సభ్యులను, చుట్టూ ఉన్నవారి నుంచి తెలుసుకోవచ్చన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం ద్వారా ఉత్తమ పోలీస్ అధికారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని డీజీపీ జితేందర్ సూచించారు.

శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ శ్రీ మహేష్ ఏం భగవత్ మాట్లాడుతూ.. కింది స్థాయిలో పోలీస్ సిబ్బంది తప్పులు చేస్తే ఉన్నతాధికారులు న్యాయస్థానంలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలలో, పోలీస్ స్టేషన్‌ సిబ్బందిలో మంచి పేరు తెచ్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కొన్ని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా వేతనాలు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ సిబ్బంది అవినీతికి పాల్పడవద్దని.. తద్వారా చెడ్డ పేరు తెచ్చుకోవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐజీ రమణ కుమార్, డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం