ఉప్పల్- ఘట్కేసర్ ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాలి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు

By Ravi
On
ఉప్పల్- ఘట్కేసర్ ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాలి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు

ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులను కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ కోసం భూమి సేకరణ ప్రక్రియలో జాప్యం అవుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయ్యేలా వెంటనే భూమి సేకరణ పూర్తిచేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమారు రూ. 400 కోట్ల వ్యయంతో నిర్మితమైన అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను మే 5న కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ  అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ కింద రోడ్డుపై ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి ఆదేశించారు.IMG-20250502-WA0090

Tags:

Advertisement

Latest News

మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు చుట్టూ సుమారు రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి అక్కడి...
పోలీసులను మిత్రులుగా భావించే స్థాయిలో పని చేయాలి. డీజీపీ జితేందర్
హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొల్లురులో ఉచిత వైద్య శిబిరం
దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం..!
కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం స్వాధీనం.. పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌..!
అక్రమంగా వెలిసిన ఇళ్లపై రెవెన్యూ అధికారుల దాడులు..!
పవన్‌పై మోదీ కన్సర్న్‌ వెనుక పెద్ద ప్లాన్‌..!