హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!

By Ravi
On
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!

హైదరాబాద్ TPN : నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అష్రఫ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. గతంలో అష్రఫ్ లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో డబల్ మర్డర్స్‌లో నిందితుడిగా ఉన్నాడు. అది మనసులో పెట్టుకుని మృతుల్లో ఒకరి తమ్ముడైన ఇంతియాజ్ అష్రఫ్‌ను హత్య చేయాలని ప్రణాళిక రచించినట్లు అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ స్పష్టం చేశారు. అష్రఫ్ రియల్ ఎస్టేట్ పార్టనర్‌లైన సయ్యద్ అఫ్రోజ్, మహమ్మద్ షా ఒవైసీ, మొహమ్మద్ అర్బాజ్ ఖాన్, సయ్యద్ ఫిర్దూజ్, సయ్యద్ ఇంతియాజ్‌తో కలిసి 18వ తేదీనాడు లంగర్‌హౌస్ పెన్షన్‌పురా ప్రాంతంలో ఓ క్వాలిస్ వాహనంలో.. రెండు రివాల్వర్లు, ఐదు రౌండ్ల బుల్లెట్లు పెట్టుకొని ఉన్నారని కచ్చితమైన సమాచారం రావడంతో.. పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రెండు పిస్టల్స్‌తోపాటు ఐదు రౌండ్ల బుల్లెట్లు, క్వాలిస్ వాహనంతోపాటు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే పోలీసులు చూస్తూ ఊరుకోరని.. వారిని కచ్చితంగా కటకటాల వెనక్కి పంపిస్తామని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు.

Advertisement

Latest News

తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం
ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 పోలీస్ ర్యాంకింగ్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ హర్షం వ్యక్తం చేశారు....
ఒక్క లేఖ విలువ అక్షరాలా రూ. 3,900 కోట్లు..!
హైదరాబాద్‌లో ఇద్దరు నకిలీ జర్నలిస్ట్‌ల అరెస్ట్‌
నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..!
బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!