యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!

By Ravi
On
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!

హైదరాబాద్‌ TPN :  బేగంపేట చౌరస్తాలో నిప్పోన్‌ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా.. వాహనదారులకు వినూత్న రీతిలో యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్, సీటు బెల్టు లేని వారికి వాటి ఆవశ్యకతను వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని.. దీనివలన వాహనాలు నడిపే వారితోపాటు ఎదుటివారికి ప్రాణహాని ఉంటుందని హెచ్చరించారు. అతి వేగం పనికిరాదన్నారు. గమ్యస్థానానికి బయలుదేరే ముందు కొద్ది నిమిషాల ముందు బయలుదేరితే సురక్షితంగా.. ఎలాంటి టెన్షన్ లేకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా రోడ్డుపై వచ్చిన వారి వాహనాలను ఆపి, యముడి వేషధారి వారికి ట్రాఫిక్ అవగాహన కల్పించారు. నిప్పోన్‌ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇండియా  కమ్యూనిటీ సర్వీస్ కింద అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఆర్గనైజర్స్ తెలిపారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!