అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక సూచన..

By Ravi
On
అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక సూచన..

పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ లతో ఫోన్‌లో మాట్లాడారు. రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి కోరారు. షాబాజ్, జైశంకర్‌లతో విడివిడిగా చర్చలు జరిపిన తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి అమెరికా మద్దతు ఇస్తుందని, పహల్గామ్ దాడి దర్యాప్తులో సహకరించాలని పాకిస్తాన్‌ ను కోరిందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. 

కాగా ఇస్లామాబాద్‌, దక్షిణాసియాలో తాజా ఘటనలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి తమ ఉద్దేశ్యాన్ని ప్రధానమంత్రి వివరించారని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. సింధు జల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేయడం అనే అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది. ఇది 24 కోట్ల మందికి జీవనాధారమని.. దానిలో ఏకపక్షంగా ఉపసంహరించుకునే నిబంధన లేదని పేర్కొంది. ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ తో కలిసి పనిచేయాలని రూబియో పాకిస్తాన్ ప్రధానిని కోరారు. మరి ఈ విషయంపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Latest News

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ నాయకుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా
మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం