సరూర్ నగర్ చెరువులో పడి చిన్నారి మృతి
By Ravi
On
ఆడుకుంటూ ప్రమాద వశాత్తు సరూర్ నగర్ చెరువు లో పడి అభిత అనే 6 ఆరు సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. చెరువు చుట్టు పెన్సిగ్ లేకపోవడంతో చెరువులో పడిపోయిన చిన్నారి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నంబర్ 14లో చెరువు పక్కన కాలనీలో నివాసం ఉంటున్న నెల్లూరు జిల్లా కు చెందిన పాలకుర్తి శ్రీను, శ్రావణి దంపతులు. వీరికి నలుగురు ఆడపిల్లలు. ఈ దంపతుల రెండవ కూతురు అభిత (6) నిన్న చెరువు లో సాయంత్రం నాలుగు గంటలకు పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చెరువులో గాలించి బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
29 Apr 2025 22:30:48
గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్, దాదాపు ఐదు నెలల...