టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!

By Ravi
On
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!

హైదరాబాద్‌ TPN :  హైదరాబాద్‌ తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో గుండె జ‌బ్బులకు సంబంధించిన క్యాథ్ ల్యాబ్ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. క్యాథ్ ల్యాబ్‌తో పాటు 12 బెడ్లకు విస్త‌రించిన ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్‌ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ప్రారంభించారు. ఫ్యాక్ట్స్ ఫౌండేష‌న్ స‌హ‌కారంతో తార్నాక ఆసుప‌త్రిలో క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయ‌గా.. క్రిటిక‌ల్ కార్డియ‌క్ కేర్ యూనిట్‌కు అశోక్ లేలాండ్ సంస్థ స‌హ‌క‌రించింది. అలాగే, ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్ విస్త‌రణ‌కు నిర్మాణ్ డాట్ ఓఆర్‌జీ అనే సంస్థ ద్వారా ఐఓసీఎల్ ఆర్థిక సాయం చేసింది. 
ప్రారంభోత్స‌వంలో వీసీ స‌జ్జ‌నార్ మాట్లాడుతూ.. టీజీఎస్ఆర్టీసీకి ప్రధాన వనరులైన ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ఉంటుందని యాజమాన్యం భావించి.. తార్నాక ఆసుప‌త్రిని సూప‌ర్ స్పెషాలిటీ హాస్ఫిటల్‌గా తీరిదిద్దామ‌ని చెప్పారు. దేశంలో ఏ ఆర్టీసీలో లేనివిధంగా ఉద్యోగులకు ఇక్కడ కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలను అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే తార్నాక ఆస్పత్రిలో 2021లో ప్రతి రోజు సగటున 600  అవుట్‌ పేషంట్లు రాగా.. ప్రస్తుతం అది 2 వేల‌కు పెరిగింద‌ని తెలిపారు. 

ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని క్యాథ్ ల్యాబ్, క్రిటిక‌ల్ కార్డియ‌క్ కేర్ యూనిట్‌తోపాటు ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్ విస్త‌రణ‌కు స‌హ‌క‌రించిన ఐఓసీఎల్, ప్యాక్ట్స్ ఫౌండేష‌న్, అశోక్ లేలాండ్ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ను ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌నార్ అభినందించారు. ఈ ఆస్పత్రిలో నూత‌నంగా ఏర్పాటు చేసిన పూర్తిస్థాయి MRI, CT స్కాన్ సౌకర్యంతో పాటు ఎమర్జెన్సీ వార్డు, 24 గంటల ఫార్మసీ, ఫిజియోథెరఫి యూనిట్ అందుబాటులో ఉన్నాయ‌న్నారు. తాజాగా క్యాథ్ ల్యాబ్ సేవ‌లను ప్రారంభించ‌డంతో ఇక్క‌డ అన్ని రకాల సేవ‌లు అందుబాటులోకి  వ‌చ్చాయ‌ని చెప్పారు. ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకునేందుకు ఉద్యోగుల‌తో పాటు వారి జీవిత భాగ‌స్వాములకు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌లో భాగంగా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి.. అంద‌రి హెల్త్ ప్రొఫైల్స్‌ను రూపొందించామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మం వ‌ల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలున్న 900 మందికి తార్నాక ఆసుప‌త్రిలో అత్యవసర చికిత్సను అందించి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడిన‌ట్లు చెప్పారు. సాంకేతికతను వినియోగించుకుని ఉద్యోగుల‌కు మెరుగైన వైద్య సేవలను అందించాలని  నిర్ణయించిన‌ట్లు తెలిపారు. భవిష్యత్‌లోనూ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు ఎన్నో కార్యక్రమాలను యాజ‌మాన్యం తీసుకువ‌స్తుంద‌ని వెల్ల‌డించారు.

WhatsApp Image 2025-04-18 at 7.54.49 PM

Advertisement

Latest News

గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...
మహేంద్రహిల్స్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు
బడంగిపేటలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అయిదుగురు అరెస్ట్
జార్ఖండ్ యువతిపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్
నకిలీ ఔషధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. Dca
ఘనంగా కట్టమైసమ్మ జాతర.. భారీగా హాజరైన భక్తులు