సిటీలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు..!

By Ravi
On
సిటీలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు..!

భారీ డ్రగ్ రాకెట్‌ ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అరెస్ట్ చేసింది. హైదరాబాద్, బెంగళూరుతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఇలా డ్రగ్స్ విక్రయిస్తూ కోట్ల రూపాయల్ని నైజిరియాకు తరలించారు. తెలంగాణతోపాటు విదేశాలకు డ్రగ్స్ ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్నారు. ఈ మత్తు మందు ముఠాలో మొత్తం 13 మంది సభ్యుల్ని పోలీసులు గుర్తించారు. వీరిలో ముగ్గురి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ముఠాలోని ప్రధాన నిందితురాలు ఎబుక సుజీతోపాటు మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ కోసం విదేశాల్లో ఉన్న మాఫియాకు చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. వీళ్ల నుంచి రూ.12.5 లక్షల విలువచేసే 15 గ్రాముల కోకైన్, 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ముఠా ఇండియా నుంచి అమెరికాకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తోందని.. కోట్ల రూపాయల మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు చెప్పారు. లాటిన్ అమెరికా నుంచి కోకైన్‌ను ఇండియాకు అక్రమంగా దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్, బెంగళూరుతో పాటు అమెరికా నుంచి డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును హవాలా ద్వారా నైజీరియాకు తరలించారని చెప్పారు. తాజాగా రూ.80 లక్షలు.. రెండు మూడేళ్లలో రూ.5 కోట్లకు పైగా నైజీరియాకి తరలించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసే ఏజెంట్స్.. నైజీరియాకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో వారి వివరాలు తీసుకున్న తర్వాత ట్రాన్స్‌ఫర్ చేయాలని సూచించారు. లేదంటే ఈ తరహా క్రైమ్స్‌లో కేసులు నమోదు చేస్తామన్నారు. అదేవిధంగా వీరికి ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో ఫార్మ్-సీ లో వారి పూర్తి వివరాలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానస్పదంగా అనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థులు ఎవరూ కూడా డ్రగ్స్‌ మహమ్మారి బారిన పడొద్దని చెప్పారు.

IMG-20250405-WA0171

Tags:

Advertisement

Latest News