నాంపల్లి పీహెచ్‌సీ వైద్య సేవలను ప్రశంసించిన జిల్లా కలెక్టర్
నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా మంచి వైద్య సేవలందిస్తున్నందుకుగాను పీహెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్ భవాని ని,సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపి రిజిస్టర్,ఈ డి డి,ఏ ఎన్ సి తో పాటు అన్ని రిజిస్టర్ లను తనిఖీ చేయడమే కాకుండా ,
ఏ ఆసుపత్రిలో లేనివిధంగా నాంపల్లి పీ హెచ్ సి లో 7 మంది ఇన్ పేషెంట్లు ఉండడం చూసి జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి వచ్చిన ఇన్ పేషెంట్లతో మాట్లాడారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని ?డాక్టర్ అందర్నీ పరీక్షిస్తున్నారా? అని అడిగారు .డాక్టర్ భవాని మేడం మంచి వైద్య సేవలు అందిస్తున్నారని అందువల్ల తాము నాగర్ కర్నూల్ నుండి ,హైదరాబాద్ నుండి వచ్చామని ఇద్దరు పేషెంట్లు కలెక్టర్ కు తెలిపారు. కాగా శుక్రవారం జిల్లా కలెక్టర్ హెచ్ సి ని సందర్శించే సమయానికే 73 మంది ఓపి పేషెంట్లు వైద్య సేవలు పొందడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ భవానిని అభినదించారు.డాక్టర్ తో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి రోగులు ఆసుపత్రికి వస్తున్నారని? అడిగారు. బాలికల హాస్టల్ కు రెగ్యులర్ గా వెళ్తున్నారా ? అక్కడ సమస్యలు ఏంటని ప్రశ్నించగా? విద్యార్థినిలు చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారని డాక్టర్ భవాని సాగర్ జిల్లా కలెక్టర్ తెలుపగా, బాలికలు రక్తహీనతతో బాధపడకుండా వారికి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఆస్పత్రి పరిధిలో ఇప్పటివరకు జరిగిన శిశు మరణాల సంఖ్యను అడిగగా గత సంవత్సరం డిసెంబర్ వరకు 6 కేసులు నమోదు కాగా, అనంతరం ఈ మూడు నెలల్లో ఎలాంటి శిశు మరణాలు లేవని డాక్టర్ తెలిపారు.శిశు మరణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని , రక్తహీనత లేకుండా మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు ఎండకు వెళ్లకుండా తగువిధంగా తాగు నీటితో పాటు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ఆటో క్లేవ్, ఫీటల్ డాప్లర్ ,సర్జికల్ పరికరాలను మంజూరు చేశారు .
అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగది, డైనింగ్ ,తరగతి గదులు, భోజనం అన్నిటిని పరిశీలించారు. వంటగదితోపాటు, డ్రైనింగు, పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ,ప్రత్యేకించి గ్యాస్ స్టవ్ ను రోజు శుభ్రం చేయాలని సూచించారు. 5 వ తరగతి, 10 వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినిలు ప్రత్యేకంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని బాగా చదవాలని, క్రమ పద్ధతిలో లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు. విద్యార్తినిలకు పలు ప్రశ్నలు వేయడం ద్వారా జవాబులు రాబట్టి వారి విద్యా సామర్ధ్యాలను తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ వెంట నాంపల్లి తహసిల్దార్ జి .దేవా సింగ్, ఎంపీడీవో శ్రీనివాస శర్మ, ఎంపీఓ ఝాన్సీ, తదితరులు ఉన్నారు.