నిండు శాసనసభలో పచ్చి అబద్దాలు మాట్లాడిన మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

By Ravi
On

•    రాష్ట్ర ఏర్పాటుకు ముందు 24,245 కి.మీ
•    కొత్తగా 8,578 కిలోమీటర్ల రోడ్ల ఏర్పాటు
•    ఇందులో రెండు లైన్ల రోడ్లు- 8218 కి.మీ
•    నాలుగు లైన్ల రోడ్లు-321 కి.మీ.
•    ఆరు లైన్ల రోడ్లు -39 కి.మీ
•    ప్రస్తుతం 32,717 కిలోమీటర్ల రోడ్లు. 
•    కొత్త బ్రిడ్జీలు 382

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తొమ్మిదిన్నరేండ్ల బిఆర్ఎస్ పాలనలో రోడ్లు, భవనాల శాఖ ద్వారా జరిగిన అభివృద్ది గణాంకాలను చెరిపి వేసే విధంగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 

బిఆర్ఎస్ పాలనలో నల్లగొండ నియోజకవర్గంకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో మంత్రి కోమటి రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. 

మా BRS ప్రభుత్వ హయాంలో నల్లగొండ నియోజకవర్గంలో 279.5 కోట్లు ఖర్చు చేసి 80.1 కి.మీ రోడ్లు వేసినట్లు గుర్తు చేసారు. 
 
సభను, శాసన సభ్యులను తప్పుదోవ పట్టించే తీరు పట్ల స్పీకర్ గారికి ప్రివిలేష్ మోషన్ ఇస్తామన్నారు. 

కాంగ్రెస్ నాయకుల తీరు ఎట్లుందంటే, ఎన్నికల సమయంలో అబద్దాలే, బయటా అబద్దాలే, ఇప్పుడు పవిత్రమైన శాసన సభలోనూ పచ్చి అబద్దాలే

అబద్దాలే ఆత్మగా, అబద్ధాలే అంతరాత్మగా 15 నెలల కాంగ్రెస్ పాలన కొనసాగుతన్నదని విమర్శించారు. 

అబద్దాల ప్రవాహాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోనూ పారిస్తున్నారు. 

తొమ్మిదిన్నర ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో రోడ్లు భవనాల శాఖ ద్వారా వేసిన రోడ్లు,  బ్రిడ్జిల వివరాలను ఒక ప్రకటన ద్వారా విడుదల చేసారు. 

 

Tags:

Advertisement

Latest News

కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..! కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని జుంటుపల్లిలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు, బాజాభజంత్రీల మధ్య కొనసాగిన కల్యాణ మహోత్సవం కనుల...
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!
పిఠాపురంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ..! 
విజయవాడలో జాక్‌ సినిమా టీమ్‌ సందడి..!