చీకోటికి చిక్కిన కేటుగాడు..!

By Ravi
On
చీకోటికి చిక్కిన కేటుగాడు..!

చీకోటి ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సనాతన ధర్మం కోసం పోరాటం చేసే వారిలో ఆయన ముందుంటారు. దేవాలయాలు, హిందువుల జోలికి వస్తే మండిపడతారు. అలాంటి చీకోటి ప్రవీణ్‌నే బోల్తా కొట్టించాలని ఓ కేటుగాడు ప్రయత్నించాడు. తన దగ్గర రైస్ పుల్లర్‌ ఉందని.. అది తీసుకుంటే సీఎం అవ్వడం ఖాయం అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే.. చీకోటిని తక్కువ అంచనా వేసినట్లు ఆలస్యంగా తెలుసుకున్నాడు. మరోవైపు చీకోటి కూడా ఏమీ తెలియనట్లు నటించి చివర్లో సస్పెన్స్‌కు తెరదించి.. కేటుగాడిని బురిడీ కొట్టించారు. ఇలాంటి వారి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అనంతరం నిందితుడిని వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అప్పగించారు.

IMG-20250405-WA0079

Tags:

Advertisement

Latest News