బెట్టింగ్ యాప్ కేసులో పంజాగుట్ట పిఎస్‌లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల

By Ravi
On
బెట్టింగ్ యాప్ కేసులో పంజాగుట్ట పిఎస్‌లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల

హైదరాబాద్, మార్చి 24:

బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసుల విచారణలో భాగంగా టాలీవుడ్ యాంకర్ శ్యామల నేడు విచారణకు హాజరయ్యారు.

శ్యామలపై నమోదైన FIRను కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, న్యాయస్థానం ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశించింది. అయితే, విచారణలో సహకరించాలని శ్యామలకి సూచనలు చేసింది.

ఇప్పటికే ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలు, విష్ణుప్రియ మరియు రీతూ చౌదరి పంజాగుట్ట పోలీసుల వద్ద విచారింపబడ్డారు. రేపు మరోసారి ఈ కేసులో విచారణ కొనసాగనుందని పోలీసు అధికారులు తెలిపారు.

ఈ కేసులో ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖుల వివరణలు తెలుసుకోవడం కొనసాగుతున్నది.

Tags:

Advertisement

Latest News