మహేశ్వరాన్ని ఫ్యూచర్ సిటిలో కలపాలని మంత్రి శ్రీధర్ బాబును కోరిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి
రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు, జేఏసీ చైర్మన్ రఘుపతి మరియు అఖిలపక్ష నాయకులు మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటిలో కలపాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రం, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంత్రితో మంత్రి క్వార్టర్స్ లో జరిగిన సమావేశంలో అందజేయబడింది.
ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, "మహేశ్వరం మండలాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటిలో కలపడానికి ప్రయత్నిస్తాం" అని హామీ ఇచ్చారు. ఆయన గతంలో కేఎల్‌ఆర్ కూడా కందుకూరు, మహేశ్వరం మండలాలను కలపాలని సూచించారని, ప్రజల ఆకాంక్షలు, అఖిలపక్ష నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని దీనిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి, జేఏసీ చైర్మన్ రఘుపతి, మహేశ్వరం మండల అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.