విశాఖలో ఐటి హబ్ ని సాఫ్ట్వేర్ కేంద్రంగా చేసేందుకు చంద్రబాబు కృషి

By Ravi
On
విశాఖలో ఐటి హబ్ ని  సాఫ్ట్వేర్  కేంద్రంగా చేసేందుకు చంద్రబాబు కృషి

గూగుల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే కూన రవికూమర్

TPN RAJASEKHAR SRIKAKULAM 
Date 04/03/25

  • ఎఐలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి
  •  రాష్ట్రంలో ఐటి కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం
  •  ఎక్కువ కంపెనీలు స్థాపించాలి 

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ) రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో గూగుల్ ఆహ్వానం మేరకు ఆ సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రస్తుత కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత క్రియాశీలంగా మరియు వేగంగా దూసుకుపోతున్నటువంటి ఏఐ టెక్నాలజీ విశిష్టత కోసం గూగుల్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ తో సమావేశం అయ్యారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని విద్యా, వైద్య, సాఫ్ట్ వేర్ అన్ని రంగాల్లో ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించి ఇంజనీరింగ్, ఐటి, ఏఐ రంగాలలో ఏపీ లో పెట్టుబడులు కోసం గూగుల్ కంపెనీకి చెందిన పలువురు నిపుణులతో మాట్లాడారు.

సాఫ్ట్వేర్ రంగంలో తెలుగువారు సాధిస్తున్న అభివృద్ధిని కొనియాడుతూ తెలుగువారు సాఫ్ట్ వేర్ రంగంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఉండటాన్ని గుర్తు చేస్తూ ఏపీ లో ఉన్న వివిధ కంపెనీల గురించి మరియు యూనివర్సిటీ ల గురించి క్లుప్తంగా వివరించారు. రానున్న రోజుల్లో దేశంలోనే సాఫ్ట్వేర్కి వైజాగ్ ని ఐటి హబ్ గా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని గూగుల్ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు.విశాఖలో కంపెనీలు స్థాపించాలి.

విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు కావలసిన హాస్పిటాలిటీ అంతా ఉందని, ఆహ్లాదకర సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. వీలైనంత తొందరగా వైజాగ్లో గూగుల్ కంపెనీని స్థాపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఆలను కలుసుకొని గత సైకో వైసీపీ ప్రభుత్వం సాఫ్ట్వేర్ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో నాశనం చేసిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ కంపెనీలకి అనుకూలమైన వాతావరణ కల్పించారని పలు రాయితీలు ఇస్తున్నారని ఉత్తరాంధ్రలోని వైజాగ్ ప్రాంతం సాఫ్ట్వేర్ రంగానికి అనుకూలమైన ప్రాంతంగా ఉందని విశాఖపట్నం సిటీలో ప్రస్తుతం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంటే అది సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ చలువ అని, భవిష్యత్తులో ఇంకా పూర్తిస్థాయిలో వీలైనంత ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రారంభించాలని, రాష్ట్ర యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు.

Tags:

Advertisement

Latest News