చలివేంద్రాన్ని ప్రారంభించిన అదనపు జిల్లా జడ్జి

By Ravi
On
చలివేంద్రాన్ని ప్రారంభించిన అదనపు జిల్లా జడ్జి

కాకినాడ:
సోమవారం నాడు 13వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి ఎం. శంకర్రావు స్థానిక కోర్టుల ప్రాంగణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి ఎండలు తీవ్రమవుతున్న సందర్భంలో, ఈ చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

ఈ చలివేంద్రం, జిల్లా కోర్టు, సీనియర్, జూనియర్, మేజిస్ట్రేట్ కోర్టులు, తహశీల్దార్ కార్యాలయం, ఎస్ఎటీఓ ఆఫీసు, పోలీసు స్టేషన్ వంటి కార్యాలయాలకు వచ్చే వారికి దాహార్తిని తీర్చేందుకు స్థానిక బార్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేయబడినది.

తొలిరోజు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు మరియు సుమారు 500 మందికి మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేశ్వరరావు, జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారద, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి. నాగేశ్వరరావు నాయక్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పిల్లి మురళీమోహన్, వెంకటరమణ సాయిప్రసాద్ వాడ్రేవు, సంయుక్త కార్యదర్శి చిన్నం వీర్రెడ్డి, జూనియర్ల ప్రతినిధి పిల్లా ప్రుధ్వీ, సీనియర్ మరియు జూనియర్ మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..! బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!