ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి

By Ravi
On
ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి

Kukkala Govinda Raju..TPN
Ramachandrapuram

  • రూ.16.53 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం
  • పలు శంకుస్థాపనలు చేసిన కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం

రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.16.53 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం,  మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, కమిషనర్ నాయుడులు శంకుస్థాపన చేశారు.  15వ ఆర్థిక సంఘం నిధులు, మున్సిపల్ సాధారణ నిధులుతో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. 

తొలుత వెల్ల లోని హెడ్ వాటర్ ట్యాంక్ ముఖద్వారం గేటు, ఇతర మరమ్మత్తుల కోసం రూ. 4.99 లక్షలు, రెండవ వార్డ్ స్టిల్ వెల్ పేటలో రూ.5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి, లలిత నగర్ 16 వార్డులోని సి సి రోడ్డు నిర్మాణానికి రూ.3.30 లక్షలు, అలాగే శాంతినగర్ 9వ వార్డులో సీసీ డ్రైయిన్ నిర్మాణానికి రూ.3.24 లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులుకు శంకుస్థాపన గావించారు . 

ఈ సందర్భంగా కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాల్లో ప్రజల మౌలిక సదుపాయాలు కల్పన దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. త్రాగునీరు, సిసి రోడ్ల నిర్మాణం, డ్రైన్స్ నిర్మాణం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేసిందన్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చ క్రమంలో కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు.

అభివృద్ధి,సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఇ శ్రీకాంత్, ఎ.ఈ లు, కూటమి పార్టీ నాయకులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

యూనస్‌కి హసీనా హెచ్చరిక.. యూనస్‌కి హసీనా హెచ్చరిక..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, టెంపరరీ దేశాధినేత మహ్మద్ యూనస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను విదేశాలతో కలిసి దేశ పతనానికి కుట్ర పన్నిన స్వార్థపరుడైన...
మయన్మార్‌లో మరోసారి భూకంపం..
అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్..
ఉక్రెయిన్ రష్యా దాడిపై ట్రంప్ వ్యాఖ్యలు
పసిబిడ్డల్ని అమ్ముతున్న ముఠా అరెస్ట్..
వాట్సాప్ హ్యాక్ అవ్వచ్చు.. కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..
మీర్‌పేట్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలు..!