వక్ఫ్‌ చట్టంపై మోడీ సెన్సేషనల్ కామెంట్స్..

By Ravi
On
వక్ఫ్‌ చట్టంపై మోడీ సెన్సేషనల్ కామెంట్స్..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వక్ఫ్ చట్టం మార్మోగుతుంది. హర్యానా హిస్సార్ లో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డ్ చట్టాల్ని మార్చిందని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను అడ్డం పెట్టుకుని వక్ఫ్ బోర్డ్ రూల్స్ ని కాంగ్రెస్ మార్చిందని అన్నారు. కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ వైరస్ పట్టుకుందని కామెంట్ చేశారు. ఎస్సీ, ఎస్టీకు వ్యతిరేకండా ఆ పార్టీ పనిచేస్తుందన్నారు. వక్ఫ్ బోర్డ్ పేరుతో కాంగ్రెస్ భూముల్ని దోచుకుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీకు వ్యతిరేకండా ఆ పార్టీ పనిచేస్తుందని ఆరోపించారు. అయితే ఈ చట్టం వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్ మాత్రమే ఈ చట్టం పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. వక్ఫ బోర్డు పేరుతో లక్షల హెక్టార్ల భూమిని కొల్లగొట్టారని, వక్ఫ్ బోర్డు పేరుతో పేదలు, ఆదివాసుల భూముల్ని లాక్కున్నారని మోడీ అన్నారు. 

పేద ముస్లిం మహిళలు, వితంతు మహిళలు కేంద్ర ప్రభుత్వాన్ని వక్ఫ్ బోర్డుపై లేఖలు రాశారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యాంగం కన్నా వక్ఫ్‌నే పెద్దదిగా చేసిందని అన్నారు. 2014కు ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉంటే, ఈ రోజు 150 ఎయిర్‌పోర్ట్ లు ఉన్నాయని మోడీ అన్నారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో 74 ఎయిర్ పోర్టులు మాత్రమే నిర్మించిందని నరేంద్ర మోదీ పేర్కోన్నారు.

Advertisement

Latest News

కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..! కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
హైదరాబాద్‌ కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్లాట్‌లో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. సకాలంలో వివాహం కాకపోవడంతోపాటు ఇద్దరి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి...
కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!
ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?
బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!
ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!