20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

ఏసీబీకి చిక్కిన శ్రీకాకుళం డీఎంహెచ్‌వో 

By Ravi
On
20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

ఒక ఉద్యోగికి రీపోస్టింగ్‌ ఇవ్వడానికి రూ.20 డిమాండ్‌ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కళ్లేపల్లి పీహెచ్‌సీలో సీనియర్‌ సహాయకురాలిగా పనిచేసిన దివ్యాంగురాలు ఎ.కాంతమ్మ 2024 అక్టోబర్‌ 2న మెడికల్‌ లీవ్‌పై వెళ్లి, ఆ తర్వాత సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరై రీపోస్టింగ్‌ కోసం ఆర్‌జేడీని సంప్రదించింది. ఆర్‌జేడీ కార్యాలయం రీపోస్టింగ్‌ ఇవ్వాలని డీఎంహెచ్‌వోకు ఫిబ్రవరిలోనే ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు అమలుచేయాలని డీఎంహెచ్‌వో కార్యాలయం చుట్టూ తిరిగినా స్పందించలేదు. రీపోస్టింగ్‌ కోసం వాన సురేష్‌ డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణతో మాట్లాడి రూ.20వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులను సంప్రదించింది. అందులో భాగంగా గురువారం డీఎంహెచ్‌వో బాలమురళీ కృష్ణ చాంబర్‌లో సీసీ వాన సురేష్‌కు రూ.20 వేలు నగదు ఇచ్చింది. ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ.500 నోట్లును కాంతమ్మ సీసీ వాన సురేష్‌కు ఇవ్వడం, ఆయన వద్ద డీఎంహెచ్‌వో బాలమురళీ కృష్ణ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు ప్రవేశించి డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ జేబుల్లో నుంచి పౌడర్‌ పూసిన నోట్లు స్వాధీనం చేసుకొని డీఎంహెచ్‌వోనూ, సీసీ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రికార్డులు పరిశీలించిన అనంతరం విచారించి కేసు నమోదుచేసి విశాఖపట్నం తరలించడానికి సిద్ధమయ్యారు. ఇటీవల పాలకొండలోనూ సీసీ ద్వారా డబ్బులు డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా కమిషనర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదే మాదిరిగా జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌వో సీసీ ద్వారా డబ్బులు వసూలుచేయించి అడ్డంగా బుక్కయ్యారు. డీఎంహెచ్‌వోగా అర్హత లేకపోయినా అధికార పార్టీ నాయకుల సిఫార్సుతో జనవరి 4న విధుల్లో చేరిన బాలమురళీకృష్ణ లంచావతరం ఎత్తి మూడు నెలల్లోనే ఏసీబీకి పట్టుపబడ్డారు. సీసీగా నెల రోజుల క్రితం రాజకీయ సిఫార్సుతో విధుల్లో చేరిన వాన సురేష్‌ ఇటీవల ప్రతి ఫైల్‌కు డబ్బులు వసూలుచేస్తూ డీఎంహెచ్‌వోతో కలిసి వాటాలు పంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Tags:

Advertisement

Latest News