అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్..

By Ravi
On
అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్..

అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ మరింత తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు భారీ టారీఫ్ లు విధిస్తున్నారు. తాజాగా, చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లోహాలు, అయస్కాంతాల ఎగుమతుల్ని చైనా నిలిపేసింది. ఇవి ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమేకర్లు, ఏరోస్పేస్ తయారీదారులు, సెమీకండక్టర్‌ల తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు. చైనా ప్రభుత్వం ఎగుమతుల కోసం కొత్త నియంత్రణ వ్యవస్థ, విధానాలను రూపొందిస్తోందని, కార్ల నుంచి క్షిపణుల దాకా అన్నింటి తయారీకి అవసరమయ్యే అయస్కాంతాల ఎగుమతుల్ని నిలిపేసినట్లు, అనేక చైనా ఓడరేవుల్లో షిప్‌మెంట్స్ ఉన్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి. 

కాగా ఈ నివేదికల ప్రకారం, కొత్త నియంత్రణ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత అమెరికన్ మిలిటరీ కాంట్రాక్టర్లతో సహా అన్ని కంపెనీలకు వస్తువులు చేరకుండా శాశ్వతంగా నిరోధించవచ్చని తెలుస్తోంది. అమెరికా చాలా వరకు చైనా దిగుమతులపై ఆధారపడింది. దీంతో చైనా ట్రంప్ సుంకాలకు ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. చైనా ప్రపంచంలోనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌లో దాదాపుగా 90 శాతం ఉత్పత్తిని కలిగి ఉంది. ఇది రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. రేర్ ఎర్త్ మూలకాల్లో 17ఉన్నాయి. అంతేకాకుండా ట్రంప్ చైనా ఉత్పత్తులపై 54 శాతం సుంకాలను విధించాలనే నిర్ణయానికి ప్రతీకారంగా చైనా ఏప్రిల్ 02 నుంచి అదురైన ఎర్త్ మూలకాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

Tags:

Advertisement

Latest News

కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..! కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
హైదరాబాద్‌ కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్లాట్‌లో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. సకాలంలో వివాహం కాకపోవడంతోపాటు ఇద్దరి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి...
కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!
ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?
బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!
ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!