వాట్సాప్ హ్యాక్ అవ్వచ్చు.. కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..

By Ravi
On
వాట్సాప్ హ్యాక్ అవ్వచ్చు.. కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..

మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు. భారత్‌ లోనూ కోట్లాది మంది వాట్సాప్‌ని వాడుతున్నారు. భారత వాట్సాప్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. వాట్సాప్ వల్ల మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎందుకంటే స్కామర్లు వాట్సాప్ లో బగ్ ని గుర్తించినట్లు తెలిపింది. CERT-In ప్రకారం.. వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు సైతం డేంజర్‌లో ఉన్నారంటూ ఈ క్రమంలో వార్నింగ్ ఇచ్చింది. డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లో వాట్సాప్‌ను నడుపుతున్న యూజర్లు.. డెస్క్‌టాప్ వెర్షన్ 2.2450.6 కంటే పాత వెర్షన్‌ వాడుతున్నట్లయితే ఆయా యూజర్ల సిస్టమ్స్‌ హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉంది పేర్కొంది. 

కాగా హ్యాకర్స్‌ సిస్టమ్స్‌కి పంపే ప్రమాదకరమైన ఫైల్స్‌ సాధారణంగానే కనిపిస్తాయని.. ఆ ఫైల్స్‌ని ఓపెన్‌ చేస్తే వెంటనే వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది. అకౌంట్‌ హ్యాకింగ్‌ బారినపడే చాన్స్‌ ఉంటుందని చెప్పింది. వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ని ఉపయోగించే వారంతా అప్లికేషన్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఏవైనా గుర్తు తెలియని లింక్స్‌ని క్లిక్‌ చేయడం మానుకోవాలని, తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలకు రిప్లే ఇవ్వొద్దని.. ప్రతి అప్‌డేట్‌తో వెంటనే వాట్సాప్‌ అప్లికేషన్‌ కొత్త వెర్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేయాలని తెలిపింది.

Advertisement

Latest News

కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..! కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
హైదరాబాద్‌ కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్లాట్‌లో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. సకాలంలో వివాహం కాకపోవడంతోపాటు ఇద్దరి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి...
కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!
ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?
బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!
ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!