ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన ఎమ్మెల్యే NER.

By Ravi
On
ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన ఎమ్మెల్యే NER.

  •  శభాష్ ఈశ్వరరావు... నీ పనితీరు బాగుంది.. 
  •  వెంట వచ్చిన నాయకులను చూసి సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు
  •  ఎచ్చెర్ల అభివృద్ధి కి స్పష్టమైన హామీ ఇచ్చిన సీఎం

నియోజకవర్గం లో ఉన్న సాగునీటి ప్రాజెక్టు కాలువ నిర్మాణం పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కోరడానికి  నియోజకవర్గం కూటమి నాయకులను తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు శభాష్ ఈశ్వరరావు.. నీ పని తీరుతో నాయకులను, ప్రజలను ఆకట్టుకుంటున్నావ్ అంటూ నియోజకవర్గ నాయకుల సమక్షంలో  ఎమ్మెల్యే NER గారిని ప్రత్యేకంగా అభినందించడం తో పాటు ప్రతీ విషయాన్నీ కూలంకుషంగా విని ఎచ్చెర్ల నియోజకవర్గం అభివృద్ధి కి ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు..
ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన ప్రతీ నాయకునితో ఫోటోలు దిగి .. త్వరలోనే ఎచ్చెర్ల నియోజకవర్గం పర్యటన కు వస్తానని పేర్కొన్నారు..

Tags:

Advertisement

Latest News