సీతారాముల ఆలయంలో విగ్రహాల పునః ప్రతిష్ట
NV SURYA TUNI TPN APR (4)
కాకినాడ జిల్లా తుని గడ్డి బజారులో హనుమత్ లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహ పునః ప్రతిష్టా మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం వేద పండితులు ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారం రోజులుగా ఆలయం వద్ద విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు విగ్రహాలకు ధాన్యావాసం క్షీరావాసం జరిపించారు గురువారం రాత్రి ఆలయంలో వాస్తు హోమాన్ని నిర్వహించారు విశ్వక్సేన పూజ నవగ్రహ ఆరాధన మండపారాధన వంటి పూజా కార్యక్రమాలను ప్రత్యేకంగా జరిపించారు ఆలయ కమిటీ అధ్యక్షుడు చక్కా సోమరాజు తులసి కార్యదర్శి బొడ్డేటి ప్రభాకర్ వసుధ దంపతులచే వేద పండితులు సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు.ఈ సందర్భంగా చక్కా సోమరాజు మాట్లాడుతూ ఎత్తైన మండపం ఏర్పాటు చేసి విగ్రహ పునః ప్రతిష్ట చేయడం జరిగిందన్నారు సనాతన ధర్మాన్ని అందరూ ఆచరించి తరించాలన్నారు శనివారం ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరుగుతుందని తెలిపారు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ప్రత్యేకంగా జరుగుతుందని 15వ తేదీన జరిగే అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు కట్టమూరి నూకరాజు చక్కా నాగేశ్వరరావు అనుసూరి సత్యనారాయణ పెంకే అప్పారావు పిట్ల ప్రసాద్ తిరుమల శెట్టి సత్యనారాయణ బుడకల సర్వేశ్వరరావు పిట్ల పెద్దులు గురువులు శ్రీను గోవిందు వీరబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు