చోరీ కేసును చేదించిన పోలీసులు..

By Ravi
On
చోరీ కేసును చేదించిన పోలీసులు..

శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు మీడియా సమావేశం...

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్  : గత నెల మార్చి 28న ఓ వృద్ధ మహిళ మెడలో నుండి బంగారు మంగళసూత్రాన్ని గుర్తు తెలియని వ్యక్తి లాక్కెల్లిన కేసును శామీర్ పేట్ పోలీసులు చేదించారు. ఈ సందర్బంగా శుక్రవారం శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏసిపి రాములు మాట్లాడుతూ కీసర మండలం ధర్మవరం తోటకు చెందిన ఒక వృద్ధ మహిళ తూంకుంట మున్సిపాలిటీ లోని దేవరయాంజాల్ లో తనకు రావాల్సిన పెన్షన్ తీసుకుని తన ఇంటికి వెల్లేందుకు శామీర్ పేట్ మండలం దొంగలమైసమ్మ వద్ద ఆటో కోసం వేచి చూస్తుందని తెలిపారు. అంతలో పంది నరేష్ కుమార్ (42) వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి మార్గ మధ్యలోని దొంగల మైసమ్మ ప్రాంతంలో గల ఓ వెంచర్ లో బాక్ ను ఆపి ఫోన్ మాట్లాడుతుండగా అనుమానం వచ్చిన వృద్దురాలు అఖ్కడి నుండి వెల్లిపోతుండగా అదే సమయంలో, ఆ వ్యక్తి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని బైక్ పై పరారయ్యాడని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శామీర్ పేట్ పోలిస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్పట్టి వారం రోజుల పాటు 6 టీంలు సుమారు 600 సిసి కెమెరాలతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు.నిందితుడు  నరేష్ వృత్తి రిత్యా ఆటో డ్రైవర్ అని, జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడే వాడని చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి చోరీ చేసిన 2 తులాల బంగారు మంగళసూత్రం తో పాటు, ఒక సెల్ ఫోన్, ద్వీచక్ర వాహనాన్ని స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనాధ్, సిసిఎస్ సీఐ దళి నాయుడు, ఏసిపి శశాంక్ రెడ్డి, డిఐ గంగాధర్, ఎస్ఐ లు హారిక, దశరథ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..