తార్నాకలో అపార్ట్మెంట్ పై పిడుగు
By Ravi
On
- తప్పిన ప్రమాదం
- కూలిన గోడ
తార్నాక ఎన్విఆర్ స్నిగ్ధ అపార్ట్మెంట్ 5 అంతస్తు పైన ప్రవారీ గోడ అంచు పై పిడుగు పడి గోడ స్వల్పంగా ధ్వంసం అయింది. భారీ శబ్దంతో పిడుగు పడిందని అపార్ట్మెంట్ వాసులు పేర్కొన్నారు. గోడ విరిగిపడి ఇటుక పెల్లలు తమ గార్డెన్ లో పడిపోయాయని ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని వారు పేర్కొన్నారు. భారీ భవంతుల వద్ద పిడుగు నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
Tags:
Latest News
10 Apr 2025 21:22:56
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...