బెల్టుషాపులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది - లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ

By Ravi
On
బెల్టుషాపులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది - లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ

విజయనగరం : రాష్ట్రంలో అదుపులేని స్థాయిలో పుట్టగొడుగుల్లా  పట్టణం,పల్లె అనే తేడాలేకుండా బెల్టుషాపుల ద్వారా ప్రభుత్వమే మద్యం అమ్మకాలకు తెర తీసిందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నదొకటి జరుగుతున్నది మరొకటని అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి లోక్ సత్తాపార్టీ నుండి లేక రాసామని లేకను విడుదల చేశారు ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు మూడువేల మద్యం షాపులు ఉన్నాయని వాటి ద్వారా 2025,26 లో మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 27 వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తోందని ప్రభుత్వం అంచనా వేసిందని అంచనాలకు మించి బెల్టుషాపుల ద్వారా ప్రభుత్వ అధికారుల అండతో మద్యాన్ని ఏరులై పారిస్తోందని ఆరోపించారు,2024 అక్టోబర్ నుండి 2025 మార్చి నాటికే 12 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు రాష్ట్రంలో జరిగాయని ప్రభుత్వం అసలు లక్ష్యం యువత ని ఫుల్లుగా తగించడమే లా కనిపిస్తోందని,మద్యపానం తో  కలిగే అనర్దాలు,దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ మద్యనియంత్రణ పై దృష్టి సారించాలని రాష్ట్రంలో బెల్టుషాపులు లేకుండా చెయ్యాలని భీశెట్టి కోరారు,ఈ సమావేశంలో పార్టీ నాయకులు అల్లంశెట్టి నాగభూషణం, పి.ఎల్.ఎన్. రాజు,బోర రమేష్, పౌర వేదిక ప్రతినిధులు జలంత్రి రామచంద్ర రాజు,ఇప్పలవలస గోపి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..