శ్రీకాకుళం పట్టణం కంపోస్టు కాలనీ అభివృద్ధి పై శాసనసభలో చర్చ
- శ్రీకాకుళం కంపోస్ట్ కాలనీలో ఉన్న 200 ఇల్లను రెగ్యులర్ చేయాలి అన్న ఎమ్మెల్యే గోండు శంకర్.
- సుమారు 1500 కుటుంబాల ప్రజలు ఈ కంపోస్ట్ కాలనిలో నివాస్తున్నారు.
TPN Srikakulam Rajasekhar
Date 20/03/25
శ్రీకాకుళం పట్టణంలో 1976 సంవత్సరం నుండి 1995 సంవత్సరం వరకు 50 సంవత్సరాలు తర్వాత ఎలక్ట్రిఫికేషన్ జరిగిందని, 1998 లో సీసీ రోడ్డు నిర్మాణం జరిగిందని గురువారం శాసనసభలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. పట్టణంలో సుమారు 1500 కుటుంబాలు ఎలక్ట్రికల్, ఇంటి పన్నులు కడుతున్నారని వారికి రెగ్యులర్ చేయాలని తెలిపారు. కంపోస్ట్ కాలనీలో 200 కుటుంబాలు ఉన్నాయని వారికి రెగ్యులర్ చేయాలని, 345,46,48,55,56,358/1 లో మున్సిపల్ రికార్డుల్లో గోర్జు దారిగా ఉందని , దాని రెగ్యులర్ చేయాలని జీవో నెంబర్ 30, తారీకు 29-01-2025 ప్రకారం రెగ్యులర్ చేయాలని తెలిపారు. ఎలక్ట్రిఫికేషన్, మున్సిపల్ ఇంటి పన్నులు, రెగ్యులర్గా కడుతున్నారని, వారి యొక్క నివాస స్థలాలు రెగ్యులర్ చేస్తే 1500 కుటుంబాలుకు మేలు జరుగుతుందని శంకర్ తెలిపారు. శాసనసభ సమయం వృధా చేయకుండా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సభ ముందు ఉంచినందుకు శంకర్ కు స్పీకర్ అభినందించారు.