సిటీలో పలుచోట్ల ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసుల దాడులు - డ్రగ్స్, గంజాయి పట్టివేత
డ్రగ్స్ పట్టివేత జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 11 లో ఒక వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఏ టీం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో జీరో సెవెన్ గ్రామ 3.7 గ్రామ్స్ ఎస్టి ఫీల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కుర్రపాటి సాయి మణికంఠ జూబ్లీహిల్స్ చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు ఈ డ్రగ్స్ సప్లై చేసినటువంటి గాజుల రామారం కు చెందిన ప్రభాకర్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేశారు ఇతను ఆబ్స్ఖండ్లో ఉన్నట్టు ఎయిటీన్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు. పట్టుకున్న డ్రగ్స ను అరెస్ట్ చేసిన వ్యక్తిని, ఒక మొబైల్ ఫోన్,ఒక బైకును జూబ్లీహిల్స్ స్టేషన్లో అప్పగించారు.
1.2 కేజీల గంజాయి పట్టివేత. చాంద్రాయణ గుట్ట రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి అమ్ముతున్నారని సమాచారం మేరకు ఎస్టిఎఫ్ డి టీం దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో ఎస్టిఎఫ్ టీం 1.2 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి రెండు మొబైల్స్ ని ఒక బైకును కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన పి. నిఖిల్ ప్రేమ్ కుమార్ రాజును అరెస్ట్ చేశారు . జె. చైతన్య సిద్ధార్థ అనే వ్యక్తిని కూడా పై కేసు నమోదు చేశారు ఇతను పరారీలో ఉన్నట్లు ఎస్టిఎఫ్ లీడర్ తిరుపతి యాదవ్ తెలిపారు.