ప్రాంతీయ ఆసుపత్రిలో ఉచిత దంతవైద్య శిబిరం
vamsi krishna, anaparthi, tpn
మానవులు తమ నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం ద్వారా అనేక రుగ్మతలు నుండి కాపాడుకోవచ్చని అనపర్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ తాడి రామ గుర్రెడ్డి అన్నారు. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్బంగా అనపర్తి ఏరియా హాస్పిటల్ లో జరిగిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన చర్యలు ను అయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డెంటల్ సర్జన్ డాక్టర్ సి హెచ్ ఎస్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో రోగులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు... ఈ కార్యక్రమం లో ఆసుపత్రి సి ఎస్ ఆర్ యం ఓ డాక్టర్ పద్మశ్రీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ తరుణ్ , డాక్టర్ కోటేశ్వరి , డాక్టర్ అమృత, డాక్టర్ చారి , నర్సింగ్ సూపరింటెండెంట్ సరోజినీ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డీకే దుర్గా ప్రసాద్ , ఇతర వైద్యులు , సిబ్బంది పాల్గొన్నారు