రిజిస్ట్రేషన్ కోసం ఏప్రియల్ 4 నుంచి అందుబాటులో స్లాట్ బుకింగ్
స్లాట్ బుకింగ్ పై అవగాహన కల్పించడం జరుగుతుంది....
రిజిస్ట్రేషన్ కోసం : registration.ap.gov.in సందర్శించండి - జిల్లా రిజిస్ట్రార్ ఆర్. సత్యనారాయణ.
TPN, Sri Ch
Rajamahendravaram, April 02
డైనమిక్ క్యూ మేనేజ్ మెంట్ సిస్టమ్ (DQMS) ద్వారా రిజిస్టేషన్ సేవలు ఏప్రియల్ 4 వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఆర్ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ రాష్ట్రములో డైనమిక్ క్యూ మేనేజ్ మెంట్ సిస్టమ్ (DQMS) ద్వారా రిజిస్టేషన్ సేవలు అనగా దస్తావేజు దాఖలు చేసుకొనుటకు కక్షిదారులకు అనుకూలమైన సమయము యెంచుకొని ఆ సమయములో రిజిస్ట్రేషన్ సేవలు పొందుటకు ఏప్రిల్ 4వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తముగా 26 జిల్లాలోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలులో (R.O O.B) అమలు చేయడం జరుగుతుందని జిల్లా రిజిస్ట్రార్ ఆర్ సత్యనారాయణ తెలిపారు.
ఇందుకు సంబంధించి స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి . ?
పబ్లిక్ డేటా ఎంట్రీ (PDE) విధానం ద్వారా అధికారిక వెబ్ సైట్ : registration.ap.gov.in లోని స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
ప్రజలకు చేకూరే లాభాలు :
వెయిటింగ్ టైమ్ తగ్గుతుంది, సౌకర్యవంతమైన ప్రణాళిక , పారదర్శకతగా ఉంటుంది. సిబ్బంది నిర్వాహణ సులభతరం చేస్తూ దస్తావేజులు ముందస్తు పరిశీలన చేయడం వలన మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుంది. అందుబాటులో వుండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు 2025 ఏప్రిల్ 4 వ తేదీ నుంచి రాష్ట్రములోని మొత్తం 26 జిల్లా ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఈ ప్రక్రియ ప్రారంభించడం లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కేంద్రం నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ స్లాట్ బుకింగ్ విధానం దశల వారీగా విస్తరించ నున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం : registration.ap.gov.in వెబ్ సైట్ సందర్శించాలని పేర్కొన్నారు.