హెచ్ సీ యూ ఫుల్ టెన్షన్.. ఆందోళనకు దిగిన స్టూడెంట్స్
* స్పృహతప్పి పడిపోయిన విద్యార్థులు
* మరి కొందరికి గాయాలు
* అక్రమ వేలాన్ని ప్రశ్నించినందుకే రేవంత్ సర్కారు పోలీసు దాడులు
* ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టకుండా దాడులతో అడ్డుకున్న పోలీసులు
* పోలీసు దాడులను ఖండించాలని ప్రజాస్వామ్యవాదులకు హెచ్ సీ యూ స్టూడెంట్స్ యూనియన్ పిలుపు
గచ్చిబౌలి: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు యూనివర్సిటీ భూములపై, నిరసన తెలియజేసిన విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి స్టూడెంట్స్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయడమే కాకుండా, దివాళా లోటును పూడ్చుకోవడానికి హెచ్ సీ యూ భూములపై కన్నువేసి వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని స్టూడెంట్స్ యూనియన్ ఆరోపించింది.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి విద్యార్థులను గుంట నక్కలుగా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించింది. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, వెంటనే విద్యార్థిలోకానికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో రేవంత్ ఇంటిని ముట్టడించి గుణపాఠం చెప్తామని హెచ్చరిక జారీ చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తూ అసెంబ్లీని, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని, 2300 ఎకరాల అటవీ భూమి ఉంటే, యూనివర్సిటి వచ్చి ఫుట్బాల్ ఆడిన రేవంత్ కి కళ్ళు కనిపించలేదా అని ప్రశ్నించారు.
ఇవ్వాళ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్నం చేయాలని స్టూడెంట్స్ యూనియన్ పిలుపునిస్తే , రేవంత్ పోలీసులను పంపించి శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులను చుట్టుముట్టి దాడులు చేశారు. విద్యార్థినిలు అని కూడా చూడకుండా నెట్టివేశారు. మొదట మెయిన్ గేటు దగ్గర దిష్టి బొమ్మ దహనం చెయ్యడానికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు నెట్టివేయడతో హై టెన్షన్ నెలకొంది. కొంతమంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోగా కొంతమందికి గాయాలయ్యాయి. రేవంత్ పంపిన పోలీసులు ఎన్ని కుటిల ప్రయత్నాలు కూడా, యూనివర్సిటీ విద్యార్థులు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా సమిష్టి ఐక్యతతో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఉమేష్ అంబేడ్కర్, కార్యదర్శి నిహాద్, ఉపాధ్యక్షుడు ఆకాష్, సహాయ కార్యదర్శి త్రివేణి తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.