చైనాకు కోలుకోలేని షాక్ ఇచ్చిన అమెరికా

By Ravi
On
చైనాకు కోలుకోలేని షాక్ ఇచ్చిన అమెరికా

ప్రస్తుతం చైనాకు, అమెరికాకు మధ్య ట్రేడ్ వార్ అనివార్యంగా కనిపిస్తుంది. వాణిజ్య యుద్ధం నేప‌థ్యంలో మ‌రోసారి చైనాపై అమెరికా పంజా విసిరింది. చైనా దిగుమ‌తి వ‌స్తువుల‌పై సుంకాన్ని 245 శాతానికి అమెరికా పెంచేసింది. త‌మ వ‌స్తువుల‌పై ప్ర‌తీకారంగా చైనా దిగుమ‌తి సుంకాలు పెంచిన నేప‌థ్యంలో ఈ చ‌ర్య‌కు దిగిన‌ట్లు వైట్ హౌస్ తెలిపింది. అమెరికా ఫ‌స్ట్ ట్రేడ్ పాల‌సీ విధానంలో భాగంగా .. తాజాగా ట్రంప్ దిగుమ‌తి సుంకాన్ని పెంచిన సంగతి తెలిసిందే. చాలా వ‌ర‌కు ప్రపంచ దేశాల‌పై ట్రంప్ భారీ టారీఫ్ లు విధించారు. కానీ చైనాపై మాత్రం ఆ పెంపు మ‌రీ ఎక్కువ‌గా ఉంది. 

అమెరికా దిగుమ‌తి సుంకాన్ని పెంచిన నేప‌థ్యంలో.. రెండు రోజుల క్రితం చైనా కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. అమెరికా సంస్థ బోయింగ్ ఉత్ప‌త్తి చేస్తున్న విమానాల‌ను ఖ‌రీదు చేయ‌వ‌ద్దు అని త‌మ దేశ ఎయిర్‌లైన్స్ సంస్థ‌ల‌కు చైనా ఆదేశించిన విష‌యం తెలిసిందే. బోయింగ్ సంస్థ నుంచి విడిభాగాలు కూడా కొనుగోలు చేయ‌కూడదు అని చైనా త‌మ దేశ ఎయిర్‌లైన్స్ సంస్థ‌ల‌కు చెప్పింది. ఈ ప్ర‌క‌ట‌న బయటకు వచ్చిన నెక్ట్స్ డే అమెరికా ప్ర‌తీకార చర్య‌కు పాల్ప‌డింది. చైనా నుంచి దిగుమ‌తి అయ్యే వ‌స్తువుల‌పై సుంకాన్ని 245 శాతానికి పెంచిన‌ట్లు వైట్‌హౌజ్ ప్రకటించింది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!