వారికి రూ.10లక్షలు సాయం ప్రకటించిన బెంగాల్ సీఎం
గత కొద్ది రోజులుగా వెస్ట్ బెంగాల్ అతలాకుతలం అవుతుంది. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. హింస చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలయ్యాయి. ఇక పోలీస్ బలగాలు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా అక్కడక్కడ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక నిరసనకారులు వాహనాలను తగలబెట్టారు. ఇదిలా ఉంటే ముర్షిదాబాద్ హింసలో మరణించిన ముగ్గురు వ్యక్తుల కుటుంబానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సాయం ప్రకటించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను మమత ప్రకటించారు.
ఇక అల్లర్లు కారణంగా వందలాది హిందూ కుటుంబాలు ఇళ్లను వదిలి వేరే చోటకు వెళ్లిపోతున్నారు. ఇక హింసకు పాల్పడిన 150 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే వక్ఫ్ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేయబోమని ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. కానీ అల్లర్లు ఆగలేదు. తాజాగా బుధవారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో ముస్లిం మతాధికారులు, ఇమామ్‌లు, ముజ్జిన్‌లు, ముస్లిం మేధావులతో మమతా బెనర్జీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.