మిస్ ఫైర్.. ఇజ్రాయిల్ ప్రజలపై బాంబు?
హమాస్ ను మట్టికరిపించే లక్ష్యంతో సంవత్సరం పైగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈనేపథ్యంలో తాజాగా ఊహించని ఘటన ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్ జారవిడిచిన బాంబు సొంత ప్రజలు నివసిస్తోన్న ప్రాంతంలో పడింది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ ప్రజలు నివసించే నిర్ యిట్జాక్ ప్రాంతంలో ఐడీఎఫ్ యుద్ధ విమానం బాంబు జారవిడించింది.
గాజా మిషన్ నిమిత్తం వెళ్తోన్న విమానం నుంచి బాంబు జారిపడిపోయింది. టెక్నాలజీ మిస్టేక్ కారణంగా అలా జరిగింది అని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో ఒప్పుకుంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. యిట్జాక్ ప్రాంతంలో 550 మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే వీరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. గాజాలో నెతన్యాహు పర్యటించిన తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా.. ఆ పర్యటన వేళ నెతన్యాహు తన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. హమాస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. బందీలను అందరినీ విడుదల చేయాలని మేం ఒత్తిడి చేస్తున్నామని అన్నారు.