అమిత్ షాపై బెంగాల్ సీఎం మండిపాటు..

By Ravi
On
అమిత్ షాపై బెంగాల్ సీఎం మండిపాటు..

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై వెస్ట్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జి తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్‌ చట్టం 2025 కు వ్యతిరేకంగా బెంగాల్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడం వెనుక ఆయన హస్తం ఉందని మండిపడ్డారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అని మండిపడ్డారు. అమిత్‌ షా, బీఎస్‌ఎఫ్‌ కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని, బంగ్లాదేశీయులను రాష్ట్రంలోకి వదిలారని కామెంట్ చేశారు. హోంమంత్రి అమిత్‌ షా దర్యాప్తు సంస్థలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని మమత మండిపడ్డారు. 

కాబట్టి ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ.. అమిత్‌ షాను కంట్రోల్ చేయాలని సూచించారు. ముర్షిదాబాద్ అల్లర్ల వెనుక సరిహద్దు అవతల నుంచి వచ్చిన వ్యక్తుల పాత్ర ఉందని, ఈ విషయాన్ని నిఘా వర్గాలు తమకు తెలిపాయని చెప్పారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలను బెంగాల్‌లో జరుగుతున్నట్లు చెబుతూ సోషల్‌ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మమత ఆరోపించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమ పార్టీ ముందంజలో ఉందని అన్నారు. దీనిపై ప్రజలు శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని ఆమె కోరారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!