సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ 

By Ravi
On
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నెక్ట్స్ చీఫ్ జస్టిస్‌గా గవాయ్ పేరును కొలీజియం ప్రతిపాదించింది. ఇక మే 14న భారత మెయిన్ న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ గవాయ్ నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. దాదాపు ఆరు నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. 2007లో దేశంలోని అత్యున్నత న్యాయ పదవికి పదోన్నతి పొందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టిన రెండవ దళితుడిగా గవాయ్ రికార్డ్ సృష్టిస్తున్నారు. 

కాగా బీఆర్.గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1985లో న్యాయవాదిగా బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రాక్టీస్ చేశారు. తర్వాత ప్రభుత్వ ప్లీడర్‌ గా మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌ గా వర్క్ చేశారు. ఇక నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మే 24, 2019న సుప్రీంకోర్టుకు ప్రమోషన్ పొందారు. దాదాపు బాంబే హైకోర్టులో 16 సంవత్సరాలు పని చేశారు. కేంద్ర న్యాయశాఖ సూచనల మేరకు గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!