ఇక నుండి ట్రైన్స్ లో ఏటీఎమ్‌లు!

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ మయమైపోయింది. చేతిలో రూపాయి లేకపోయినా ఫోన్ ఉంటే చాలు. డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేయొచ్చు. డిజిటల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు నగదును చాలా ఈజీగా ఫోన్ పే, గూగుల్‌పే వంటి యాప్స్ ద్వారా ట్రాన్ఫర్ చేసేస్తున్నారు. ఇంటి రెంట్లు, కరెంటు బిల్లులు, పాల బిల్లులు ఇలా ఒకటేంటి చిన్న చిన్న అమౌంట్‌ను కూడా డిజిటల్ రూపంలోనే చెల్లిస్తున్నారు. అయినప్పటికీ ఏటీఎమ్‌లకు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ ఏటీఎమ్‌లపైనే ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు.
ఇకమీదట కదిలే రైళ్లలోనూ ఏటీఎమ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రయాణికుల కోసం రైళ్లలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ఫోకస్ చేస్తోంది. ప్రయోగాత్మకంగా ఓ మార్గంలో వీటిని ఇప్పటికే ప్రవేశపెట్టింది కూడా. సెంట్రల్ రైల్వే ఫస్ట్ టైమ్ ముంబై, మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్ లో ప్రయోగాత్మకంగా ఏటీఎమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని రైల్వే అధికారులు తాజాగా పేర్కోన్నారు. ఓ ప్రైవేటు బ్యాంక్ కు చెందిన ఏటీఎమ్‌ను ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో ఏర్పాటు చేసింది. రైలు కదులుతున్నప్పుడు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండటానికి దీనికి షట్టర్ డోర్‌ను కూడా అమర్చారు.
Latest News
