నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దృష్టిసారించి దాడులు ముమ్మరం చేసి గంజాయితోపాటు డ్రగ్స్‌ను అరికట్టాలని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆదేశాలు జారీ చేశారు. నాన్ డ్యూటీపై లిక్కర్ కనిపించిన ఎక్సైజ్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని అప్కారి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌తోపాటు అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా రంగారెడ్డి డివిజన్‌లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. వీటికి తోడు ఎప్పటికప్పుడు ఫామ్‌హౌస్‌లపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని అరికట్టాలని సూచించారు. నమోదు చేసినటువంటి కేసుల్లో ఛార్జ్‌షీట్ వెంటనే వేయాలని.. వాహనాలను వేలం వేయాలని.. స్వాధీనం చేసుకున్న గంజాయిని ఆదేశాలు తీసుకొని కాల్చివేయాలన్నారు. ఈ సమావేశంలో శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కృష్ణప్రియ, ఉజ్వల రెడ్డి, కే నవీన్, ఫయాజుద్దీన్, విజయ్ భాస్కర్ గౌడ్‌లతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.