జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
By Ravi
On
శేఖర్, TPN:
శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర సందర్బంగా శ్రీకాళహస్తి పాత బస్టాండ్ కూడలి దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. ఆ పార్టీ నేతలు అంబలి ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాలతో.. ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి కొట్టే సాయి సూచనలతో.. కాపునాడు నియోజకవర్గం అధ్యక్షులు గరికపాటి చంద్రశేఖర్ బాబు సహాయ సహకారములతో.. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ప్రతీ మంగళవారం ఉదయం 9 గంటలకు పాత బస్టాండ్ కూడలిలో అంబలి ప్రసాదం వితరణ చేయునున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాపునాడు జిల్లా అధ్యక్షులు అరిగల వేణుగోపాల్ నాయుడు, కాపునాడు పట్టణ అధ్యక్షులు పగడాల ప్రతాప్, పవన్ కళ్యాణ్ అభిమాని డీలర్ బాబు, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ గరికపాటి లిఖిత్ సాయి పాల్గొని విజయవంతం చేశారు.
Related Posts
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...