వన భోజనాలలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి

By Ravi
On
వన భోజనాలలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి

 

WhatsApp Image 2025-03-29 at 1.34.41 PMమహేశ్వరం, మార్చి 29, 2025: మహేశ్వరం నియోజకవర్గం బడన్గ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజనం లో  మాజీ మంత్రివర్యులు మరియు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి  పాల్గొన్నారు.WhatsApp Image 2025-03-29 at 1.34.40 PM

ఈ సందర్భంలో, సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ, "కార్టీక మాసం లో బంధువులతో, స్నేహితులతో కలిసి చెట్ల నీడలో భోజనం చేయడం వలన మనం ప్రకృతిని కూడా పట్ల గుర్తుచేసుకుంటాము. దీన్ని వన భోజనం అని పిలుస్తాం. ముఖ్యంగా ఉసిరి చెట్టు నీడలో ఈ వేడుకను నిర్వహించడం సర్వసాధారణం. ఇది మన ఆరోగ్యానికి మంచిదే కాదు, ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నంగా కూడా ఉంటుంది," అన్నారు.

ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని, ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ అనే సందేశం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. "మనము ప్రకృతిని కాపాడితే, ప్రకృతి కూడా మనలను కాపాడుతుంది" అనే ఆలోచన ఈ వనభోజనాలలో అంతర్గతంగా ఉందని సబితాతెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ఈ వన భోజనం ను ఘనంగా జరుపుకున్నారు.

Tags:

Advertisement

Latest News