తాండూర్ ప్రాంతంలో ఒక్కసారిగా మారిన వాతావరణం

By Ravi
On
తాండూర్ ప్రాంతంలో ఒక్కసారిగా మారిన వాతావరణం

వికారాబాద్ జిల్లా తాండూర్

తాండూర్ పట్టణంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం 12 గంటల వరకు తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో సతమతమైన తాండూర్  ప్రజలు వర్షాలు, చల్లని గాలులతో సేద తీరుతున్నారు. గురువారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తాండూర్ నియోజకవర్గంలోని పలు మండలాలలో వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం అయినా ఇంకా తేలిక పాటి వర్షం కురుస్తుంది.

Tags:

Advertisement

Latest News